- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేల కోట్ల అవినీతి ఆయన హయాంలోనే... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ హాయంలో వేల కోట్ల అవినితీ జరిగిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లను అడ్డుపెట్టుకుని జగన్ వేల కోట్లు దోచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. జగన్ ఆదేశాలతోనే టీడీఆర్ బాండ్లలో భారీ స్కాం జరిగిందని వ్యాఖ్యానించారు. టీడీఆర్ బాండ్ల స్కాంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ఇక ఈ బాండ్ల స్కాంపై సీఐడీకి తాను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. సీఐడీ అధికారులు ఈ స్కాంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బుద్దా వెంకన్న సూచించారు.
కాగా 2019-2014 మధ్య రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీల ద్వారా రోడ్డు నిర్మాణ ప్రాజెక్టు కోసం అప్పటి ప్రభుత్వం ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్ మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్లను జారీ చేసింది. రోడ్ల విస్తరణ, కొత్త నిర్మాణాల నేపథ్యంలో భూములు కోల్పోయిన వారికి ఈ బాండ్ల ద్వారా డబ్బులు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బాండ్ల ద్వారా వైసీపీ నేతలు డబ్బులు దోచుకున్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో భూములు కోల్పోయిన వారి పేరుతో పరిహారంగా వందల కోట్ల విలువైన ఈ బ్రాండ్లను దక్కించుకున్నారు. చదరపు గజానికి ఉన్న అసలు రేటు కంటే అధికంగా డబ్బులు చెల్లించేలా బ్రాండ్లు తీసుకున్నారు. అలా టీడీఆర్ బాండ్లలో వేల కోట్ల కుంభకోణానికి వైసీపీ నేతలు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అక్రమాలకు పాల్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని అటు చంద్రబాబు ప్రభుత్వం సైతం సీరియస్‌గా తీసుకుంది.