Indrakiladri: 200 బాక్సుల కిస్‌మిస్ వెనక్కి

by srinivas |   ( Updated:2024-10-05 15:53:41.0  )
Indrakiladri: 200 బాక్సుల కిస్‌మిస్ వెనక్కి
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రముఖ ఆలయాల్లో భక్తులకు అందించే ప్రసాదాలపై దృష్టి పెట్టారు. ప్రసాదాలకు సరఫరా అవుతున్న ఆహారపదార్థాలను పరిశీలిస్తున్నారు. నాణ్యత పరీక్షలు చేస్తున్నారు. తేడా ఉంటే వెంటనే వెనక్కి పంపుతున్నారు. నాణ్యత కలిగిన పదార్థాలనే సరఫరా చేయాలని కాంట్రాక్టర్లకు సూచిస్తున్నారు.

తాజాగా ఇంద్రకీలాద్రి ఆలయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. అమ్మవారి ప్రసాదానికి వినియోగించే కిస్‌మిస్‌లను పరిశీలించారు. దసరా ఉత్సవాల సందర్భంగా కాంట్రాక్టర్ 200 బాక్సుల కిస్‌మిస్‌ను ఆలయానికి పంపారు. అయితే వాటిలో నాణ్యతా లోపాన్ని అధికారులు గమనించారు. కిస్‌మిస్ సరఫరా‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 200 బాక్సుల కిస్‌మిస్‌లను వెనక్కి పంపారు. పది రోజుల వ్యవధిలో ఇది మూడో‌సారి కావడంతో కాంట్రాక్టర్‌పై సీరియస్ అయ్యారు. నాణ్యత ఉన్న సరుకులను మాత్రమే పంపాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed