పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ: కలెక్టర్ బి సత్యప్రసాద్

by Mahesh |
పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ: కలెక్టర్ బి సత్యప్రసాద్
X

దిశ, జగిత్యాల్ టౌన్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పూలను పూజించి దేవతలుగా చూసుకుని గొప్ప పండుగ బతుకమ్మ అని కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మన పండుగ, సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక ఆడపడుచుల ఔన్నత్యానికి సూచిక అని, తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు అందరూ కలిసి తీరొక్క పూలును బతుకమ్మలుగా పేర్చి ఆడుకునే గొప్ప పండుగ అని అన్నారు. దేశంలో పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని, ఇలాంటి సంస్కృతి మన తెలంగాణలోని ఉందని తెలిపారు. ఈ పండుగను ప్రజలందరూ సుఖ, సంతోషాలతో జరుపుకోవాలని, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు, గౌతమ్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, వివిధ జిల్లా శాఖల అధికారులు, మహిళ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed