ఇలాంటి సినిమాలు సక్సెస్ అవుతాయి.. ‘రివైండ్’పై డైరెక్టర్ కామెంట్స్

by sudharani |   ( Updated:2024-10-05 15:40:03.0  )
ఇలాంటి సినిమాలు సక్సెస్ అవుతాయి.. ‘రివైండ్’పై డైరెక్టర్ కామెంట్స్
X

దిశ, సినిమా: సాయి రోనాక్, అమృత చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘రివైండ్’. క్రాస్ వైర్ క్రియేషన్స్‌పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 18న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో.. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. నిర్మాత, డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘ముందుగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీడియాకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. టైం ట్రావెల్ మీద తీసిన లవ్, సై ఫై జోనర్ మూవీ. టైం ట్రావెల్ మీద వచ్చే సినిమాలు ఎప్పుడు సక్సెస్ అవుతాయి. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది. మా ఈ టైం ట్రావెల్ మీద తీసిన రివైండ్ మూవీ కూడా ప్రేక్షకులు అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో సాయి రోనాక్ మాట్లాడుతూ.. ‘చిన్న టీం అయినా ఒక మంచి లైన్‌తో స్క్రిప్ట్ తయారుచేసుకొని ఈ సినిమాని చేసాం. మాకున్న బడ్జెట్, లైన్ అప్‌తో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్‌ని తయారు చేశాం. డైరెక్టర్ కళ్యాణ్ ఎన్.ఆర్.ఐ అయ్యుండి ఇక్కడికి వచ్చి డబ్బు పెట్టి మంచి కథతో సినిమాను తీయడం నిజంగా గర్వించదగ్గ విషయం. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉంటే కచ్చితంగా సినిమాను ఆదరిస్తారు. ఈనెల 18న ఈ సినిమాని విడుదల చేయబోతుంది. ప్రేక్షకులు అందరూ సినిమా చూసి సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed