ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు

by Mahesh |
ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు
X

దిశ, ఆదిలాబాద్: తెలంగాణ సంస్కృతికి నిలువెత్తుల నిదర్శనమైన బతుకమ్మ సంబరాలను శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మెప్మా పీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో వివిధ శాఖల మహిళా జిల్లా అధికారులతో పాటు మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను సిద్ధం చేసి వేడుకలకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను తెలియజేసే పాటలతో మహిళా ఉద్యోగులు ఆడిపాడుతూ ప్రత్యేక నృత్యాలు చేస్తూ.. ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ శ్యామల దేవి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించగా దీనికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా హాజరై బతుకమ్మకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఎంతో పెద్ద పండుగ అని అన్నారు.

తొమ్మిది రోజులపాటు జరుపుకునే ఈ పండుగను ముఖ్యంగా మహిళలు సద్దుల బతుకమ్మ పండుగ వరకు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ.. ఆడిపాడుతూ బతుకమ్మ పాటలు ఆలపిస్తూ సంతోషంగా గడుపుతారని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే బతుకమ్మ పండగలను ఇంత ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని తెలియజేశారు. ఇందులో భాగంగానే కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఈ వేడుకలను మహిళా ఉద్యోగినిలతో ఘనంగా జరుపుకోవడం పై హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ఆయా శాఖల మహిళా అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed