- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్షణ కిట్లతో కల్లు గీత కార్మికులకు ప్రాణహాని ఉండదు: ఎమ్మెల్యే మల్లారెడ్డి
దిశ, కంటోన్మెంట్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాలకు సంబంధించిన కల్లు గీత కార్మికులకు వారి సంక్షేమ నిమిత్తం కాటమయ్య రక్షణ కవచం (సేఫ్టీ కిట్స్) పంపిణీ చేశారు. బోయినపల్లి లోని మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో మేడ్చల్(14) మల్కాజ్ గిరి (13) సెగ్మెంట్ల లబ్ధిదారులకు సేఫ్టీ కిట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. అనేక మంది కల్లు గీత కార్మికులు చెట్ల పై నుంచి జారిపడి మృత్యువాత పడుతున్నారు. చాలా మంది వికలాంగులు అవుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కాటమయ్య రక్షణ కవచం రూపొందించినట్లు చెప్పారు. ఈ కవచం ధరించడం వలన ప్రమాదవశాత్తు గీత కార్మికులు చెట్టు పై నుండి జారిన క్రింద పడే అవకాశం ఉండదనీ,.ప్రాణ హాని కూడా ఉండదన్నారు ఇలాంటి కిట్లు నా చేతుల మీదుగా అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కిట్లను మీరందరు ధరించి ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని లబ్ధిదారులతో మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ శాఖ అధికారులు కేశురాం, రాజేశ్వర్, ముజాహిద్, శ్రీనివాస్, కమల్ రాజ్, బీసీ వెల్ఫేర్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.