జమ్ముకశ్మీర్ లో రెండు చోట్ల ఎదురుకాల్పులు.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

by Shamantha N |
జమ్ముకశ్మీర్ లో రెండు చోట్ల ఎదురుకాల్పులు.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చగా.. పారాట్రూపర్ తో సహా ఇద్దరు జవాన్లు చనిపోయారు. అయితే, రెండుచోట్ల ఎదురుకాల్పులు జరిగిన కొన్నిగంటల్లోనే రాజౌరీ జిల్లాలోని ఆర్మీ క్యాంపు సమీపంలో కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. మంజ్ కోట్ సైనిక శిబిరంపై ఉగ్రవాదికి దాడికి యత్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో సైనికుడికి గాయాలైనట్లు తెలుస్తోంది.

కుల్గాంలో భీకర కాల్పులు

కుల్గాం జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం రాగానే భద్రతాబలగాలు ఆపరేషన్ చేపట్టారు. మోడెర్గామ్ గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు అనే పక్కా సమాచారంతో ఒక ఇంటిపై భద్రతాబలగాలు కాల్పులు జరిపారు. కాల్పుల్లో జవాను గాయపడగా..చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆ తర్వాత ఆదివారం ఉదయం ముష్కరుడి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. కుల్గామ్‌లోని ఫ్రిసల్ ప్రాంతంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్ కౌంటర్ లో జవాన్ చనిపోగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలి నుంచి నలుగురు ఉగ్రవాదుల డెడ్ బాడీలను అధికారులు స్వాధీనం చేసుకోలేకపోయారు. స్పాట్ లో మరికొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇకపోతే, గతకొంతకాలంగా ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయి. గతనెలలో దోడా జిల్లా గండో ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి.

Advertisement

Next Story