టమాటా @ 100

by Sumithra |
టమాటా @ 100
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : రోజు రోజుకు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశ రాజధానిలోనే కాదు, దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో టమాట ధరలు కిలో రూ.100కి చేరాయి. విశేషమేమిటంటే ఢిల్లీలో టమాటా రిటైల్ ధర 24 గంటల్లోనే రూ.20 పెరిగింది. మరోవైపు హోల్‌సేల్ మార్కెట్‌లో టమోటా ధర రూ.10 పెరిగింది. పండగల సమయంలో టమాటాకు గిరాకీ పెరగడం, సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయని నిపుణులు పేర్కొంటున్నారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత నెలలో టమోటా ధర రూ.27 పెరిగింది. రాజధాని ఢిల్లీ నుండి ప్రభుత్వ డేటా వరకు టమోటాల ధరలలో ఎంత పెరుగుదల కనిపించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటా ధర రూ.100..

ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతంలో టమాటా రిటైల్ ధర కిలో రూ.100గా ఉంది. నిన్నటి వరకు రూ.80గా ఉన్న టమాటా ధర కేవలం 24 గంటల్లో కిలోకు రూ.20 పెరిగాయి. రానున్న రోజుల్లో టమాటా ధరలు కిలో రూ.120కి చేరే అవకాశం ఉందని రిటైల్ విక్రేతలు చెబుతున్నారు.

పెద్ద మొత్తంలో ధరల మార్పు..

అక్టోబర్ 3న మార్కెట్ లో కిలో టమాటా రూ.70గా ఉందని కేవలం రెండు రోజుల్లోనే రూ.30 పెరగడంతో ఏకంగా సెంచరీ కొట్టిందని విక్రయదారులు, కొనుగోలు దారులు చెబుతున్నారు.

ధరలు పెరిగేందుకు కారణాలు..

పండగ డిమాండ్లే టమాటా ధరలు పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే మరోవైపు ఉత్పత్తిలో కొరత ఏర్పడిందని చెబుతున్నారు. వాతావరణం కారణంగా టమాటా పంట దెబ్బతింది. అలాగే రుతుపవనాలు ఆలస్యం కావడంతో, టమోటా ఉత్పత్తి కూడా దెబ్బతినిందని తెలిపారు. ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడమే కాకుండా సరఫరాలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. టమోటా ధరలు పెరగడానికి ఇదే కారణం అంటున్నారు.

ప్రభుత్వ లెక్కలు ఏం చెబుతున్నాయి ?

ఇక ప్రభుత్వ డేటా విషయానికొస్తే.. గత నెలలో టమాట ధరల్లో రూ.27 పెరుగుదల కనిపించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం సెప్టెంబర్ 4న కిలో టమాటా ధర రూ.43 ఉండగా, అది కిలో రూ.70కి పెరిగింది. అంటే టమాటా ధర రూ.27 పెరిగింది. మనం అక్టోబర్ గురించి మాట్లాడితే, సెప్టెంబర్ 30న కిలో టమాటా ధర రూ.63 ఉండగా, అక్టోబర్ 4 వరకు రూ.7 పెరిగింది.

Advertisement

Next Story

Most Viewed