IND VS BAN : దూబె దూరం.. జట్టులోకి తిలక్

by Harish |
IND VS BAN : దూబె దూరం.. జట్టులోకి తిలక్
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబె దూరమయ్యాడు. వెన్నెముక గాయంతో అతను సిరీస్ నుంచి తప్పుకున్నట్టు బీసీసీఐ తెలిపింది. అతని స్థానంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మను జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తిలక్ ఆదివారం గ్వాలియర్‌లో జట్టుతో కలవనున్నాడు. తిలక్ టీమిండియాకు ఆడి దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నది. చివరిసారిగా జనవరిలో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. ఆ సిరీస్ తర్వాత తిలక్‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు తిలక్‌ను పక్కనపెట్టారు. బంగ్లాతో టీ20 సిరీస్‌కు కూడా మొదట విస్మరించారు. ఇప్పుడు దూబె దూరమవడంతో అతను తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. అయితే, నేడు జరిగే తొలి టీ20లో భారత తుది జట్టులో తిలక్‌కు చోటు దక్కుతుందో లేదో చూడాలి.

Advertisement

Next Story