ఐదు విలీన గ్రామాలను అడిగిన తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ అధికారుల స్పందన ఇదే..?

by Mahesh |
ఐదు విలీన గ్రామాలను అడిగిన తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ అధికారుల స్పందన ఇదే..?
X

దిశ, వెబ్‌డెస్క్: 2023, 2024 తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాయి. ఈ క్రమంలో గత 10 సంవత్సరాలుగా మిగిలిన విభజన సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజా భవన్ లో సమావేశం అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిన అంశాలపై దాదాపు రెండు గంటల పాటు చర్చించుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం.. విభజన సమయంలో ఏడు మండలాలు ఏపీలో కలపగా అందులో కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, పిచుకలపాడు, ఎటపాక గ్రామాలను తెలంగాణ తిరిగి కేటాయించాలని రేవంత్ సర్కార్ కోరింది. ఈ ప్రతిపాదనపై ఏపీ ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారులు స్పందించారు. ఒక రాష్ట్రంలోని గ్రామాలను ఇతర రాష్ట్రాలకు కలపడం, కేటాయించడం వంటి పనులు రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవని.. అలా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకొవాలని.. స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఆ ఐదు గ్రామాల కోసం తెలంగాణ ప్రభుత్వం త్వరలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story