ఎన్నికల రేసులో ఉండాలా? లేదా?.. కొన్నిరోజుల్లో బైడెన్ తుదినిర్ణయం

by Shamantha N |
ఎన్నికల రేసులో ఉండాలా? లేదా?.. కొన్నిరోజుల్లో బైడెన్ తుదినిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి బైడెన్న సన్నిహితుడు, హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ సంచలన కామెంట్లు చేశారు. ఎన్నికల రేసులో ఉండాలా? లేదా? అనేదానిపై బైడెన్ కొన్నిరోజుల్లోనే తన నిర్ణయాన్ని చెప్తారని పేర్కొన్నారు. ఇకపోతే, ప్రెసిడెంట్ రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవాలని సొంతపార్టీ నేతలే చెబుతున్నారు. కాగా.. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ఉన్న బైడెన్.. అధ్యక్ష బరి నుంచి తప్పుకోనని స్పష్టం చేశారు. ఇలాంటి టైంలో గ్రీన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇటీవలే, బైడెన్ సహా డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో గ్రీన్ భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇలాంటి ప్రకటన చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

జోష్ గ్రీన్ ఏమన్నారంటే?

బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటే.. కమలా హారిస్ ని బరిలో దింపే అవకాశం ఉందని గ్రీన్ తెలిపారు. ఆ పదవికి తగినవాడు కాదని బైడెన్ భావిస్తే ఆయన కచ్చితంగా పక్కకు తప్పుకుంటారని అన్నారు. అభ్యర్థిత్వంపై బైజెన్ త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని చెప్పుకొచ్చారు. తన మద్దతు ఇప్పటికీ బైడెన్‌ వైపే ఉందని స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ తో జరిగిన డిబేట్ లో బైడెన్ తడబడినంత మాత్రాన ఆయన సామర్థ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు, ట్రంప్‌ వయసు కూడా తక్కువేమీ లేదని.. బైడెన్ కంటే మూడేళ్లు మాత్రమే చిన్నని గుర్తుచేశారు. అధ్యక్షుడికి వయసుతో సంబంధంలేదని.. బాధ్యతలు నిర్వర్తించడమే ముఖ్యమని అన్నారు.

Advertisement

Next Story