- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్కార్ గ్రంథాలయం ప్రారంభం..
దిశ, చిట్యాల : చిట్యాల మండల కేంద్రంలోని చల్లగరిగ గ్రామంలో గురువారం ఆస్కార్ గ్రంథాలయం ప్రారంభమైంది. ప్రపంచంలో అత్యుత్తమైన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు వరించిన సందర్భంగా తన సొంత గ్రామమైన చల్లగరిగా గ్రామంలో అంగరంగ వైభవంగా వేదమంత్రాల మధ్య ఆస్కార్ గ్రంథాలయం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రాగ వాయిద్యాలతో చిన్నపిల్లల నృత్యం తో స్వాగతం పలికారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి లైబ్రరీ రిబ్బన్ కటింగ్ బోస్ తండ్రి నరసయ్య చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి బోసు తండ్రి యొక్క ఆశీస్సులు తీసుకొని లైబ్రరీ గదుల లోకి ప్రవేశించారు. అక్కడున్న బుక్స్ ను సామాగ్రిని పరిశీలించారు.
అనంతరం సభ వేదికపై అడిషనల్ కలెక్టర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రంథాలయాన్ని ఒక దేవాలయం లాగా నిర్మించారని విజ్ఞాన భాండాగారం గ్రంథాలయంలో మాత్రమే లభిస్తుందని మన గ్రామీణ ప్రాంతంలో నెలకొల్పడం మన అదృష్టమని, యువతకు రాబోయే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలని ఉత్తమమైన అనిత్యమైన ఉన్నత శిఖరాలను అధిరోహించి అవార్డులు అందుకోవాలని దానిలోని బుక్స్ ని చదువుకుని బోసు లాగే ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలిపి శాసనసభ్యునిగా నా వంతుగా రూ.10 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ గ్రంథాలయం ప్రహరి గోడ గాని, గుడికి సంబంధించిన పనులకు గాని వెంటనే వినియోగించుకోవాలని సూచిస్తూ ఈ గ్రంథాలయానికి ఒక లైబ్రేయర్ ను ఇద్దరు అటెండర్ లను ఇవ్వాలని గ్రంథాలయ అదనపు బాధ్యతలు కలిగి ఉన్న అడిషనల్ కలెక్టర్ ను కోరారు. వెంటనే స్పందించిన అడిషనల్ కలెక్టర్ వేదికపైనే ఇస్తానని మాట ఇచ్చాడు. అదేవిధంగా బోసు కుటుంబ సభ్యులు సంవత్సరానికి రెండు మూడు సార్లు వచ్చి పరిశీలించాలని తెలిపారు.
బోస్ మాట్లాడుతూ ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా తన సొంత గ్రామానికి రాగా తన ఇంటి పక్కనే ఉన్న గ్రంథాలయం చాలా శిథిలావస్థలో ఉందని కూలిపోవడానికి సిద్ధంగా ఉండటానికి చూసి దీనిని కచ్చితంగా మార్పు తీసుకురావాలని నాకు నా అవార్డుకు పునాది ఈ గ్రంథాలయమే కాబట్టి దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకొని ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకుని 6 నెలల్లో రూ. 36 లక్షల వ్యయంతో పునః నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ గ్రంథాలయంలో ఇంకా ఎన్నో పుస్తకాలను అమూల్యమైన అత్యుత్తమైన పుస్తకాలను సేకరిస్తున్నానని అతి త్వరలో వాటిని తీసుకొస్తానని, ఆ పుస్తకాలను ఈ గ్రామీణ ప్రజలు యువత చదివి విజ్ఞానవంతులై జీవితంలో పైకి ఎదగాలని ఊరికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడాలని కోరాడు.