రాజకీయంలో పదవికే విరమణ సేవకు కాదు : ఎమ్మెల్యే పల్లా

by Aamani |
రాజకీయంలో పదవికే విరమణ సేవకు కాదు :  ఎమ్మెల్యే పల్లా
X

దిశ, చేర్యాల: చేర్యాల మండలంలోని ఎంపీటీసీ,ఎంపీపీ ల పదవీ విరమణ వీడ్కోలు సమావేశం జరిగింది. ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ అధ్యక్షతన గురువారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయంలో విరమణ అనేది పదవికి మాత్రమేనని, ప్రజా సేవకు కాదని అన్నారు.ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునే వారే నిజమైన రాజకీయ నాయకులని,అలాంటి దృక్పధం ఉన్నవారికే రాజకీయ భవిష్యత్తుఉంటుందని అన్నారు. ఎంపీటీసీలకు నిధులు చాలా తక్కువని,నాలుగేళ్లలో వారు ప్రజలకు సేవ తప్ప ఆర్థికంగా భాగుపడింది ఏమీ లేదన్నారు. చేర్యాల ప్రాంతంలో గెలిచిన ప్రజా ప్రతినిధులకు,వారి కుటుంబాలకు, అనేక త్యాగాలు చేసిన చరిత్ర ఉన్నదని, ప్రతి ఒక్కరూ పోరాట పటిమ కలిగిన వ్యక్తులేనని అన్నారు. భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచ్ లు, మండల స్థాయి అధికారులు,బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed