రేపు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..!

by srinivas |
రేపు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజయవాడకు సోమవారం వెళ్లనున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి విజయవాడ వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొననున్నారు.

Advertisement

Next Story