- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం వాసింలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్, ఇండియా కూటమి పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో రైతు రుణమాఫీ పై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు గడుస్తున్నా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. కాగా ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సీతక్క(Minister Sitakka) ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నల్ల చట్టాలు తెచ్చి రైతులకు నరకం చూపించిన మోడీకి రైతులపై మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. ఇలాంటి వారు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు.