SPG Commando : ప్రధాని మోడీ సెక్యూరిటీలో మహిళా ఎస్పీజీ కమాండో! ఫోటోలు వైరల్

by Ramesh N |   ( Updated:2024-11-28 10:43:42.0  )
SPG Commando : ప్రధాని మోడీ సెక్యూరిటీలో మహిళా ఎస్పీజీ కమాండో! ఫోటోలు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ భద్రతకు బాధ్యత వహిస్తున్న ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ)కి చెందిన ఓ మహిళా కమాండో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధానికి రక్షణ కవచంగా ఓ మహిళా కమాండోను పెట్టడం.. మహిళా సత్తాకు అద్దం పడుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రధాని మోడీ సెక్యూరిటీలో మొట్టమొదటిసారిగా మహిళా ఎస్పీజీ కమాండో అంటూ ప్రధానితో ఉన్న మహిళా కమాండో ఫోటో వైరల్‌గా మారింది.

కాగా, దేశంలో ప్రధానమంత్రి భద్రత బాధ్యత ఎస్‌పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కమాండో భుజాలపై ఉంటుంది. ప్రధాని చుట్టూ మొదటి భద్రతా వలయం ఈ ఎస్పీజీ కమాండోలు మాత్రమే ఉంటారు. ప్రధాని ఏదైన పర్యటనలో ఉన్నప్పుడు సెక్యూరిటీని ఎలా ఏర్పాటు చేయాలన్నది ఎస్పీజీ నిర్ణయం మేరకే ఉంటుంది. ప్రధాని భద్రతలో నిమగ్నమైన ఈ కమాండోలకు అమెరికా సీక్రెట్ సర్వీస్ మార్గదర్శకాల ప్రకారం శిక్షణ ఇస్తారు. వారి వద్ద ఎంఎన్ఎఫ్ -2000 అసాల్ట్ రైఫిల్, ఆటోమేటిక్ గన్, 17 ఎం రివాల్వర్ వంటి ఆధునిక ఆయుధాలు ఉంటాయి.

Advertisement

Next Story