- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పది ప్రశ్నాపత్రం లీకేజీలో బండి సంజయ్ దే కీలక పాత్ర: మంత్రి హరీష్ రావు
దిశ, మెదక్ ప్రతినిధి: పది ప్రశ్నాపత్రం లీకేజీలో బీజేపీ నగ్నంగా దొరికిపోయిందని, లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ కీలకపాత్ర వహించాడని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం బుధవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ కుట్ర నగ్నంగా బయటపడిందన్నారు.
కేసీఆర్ ను నేరుగా ఎదుర్కొలేక నీచ రాజకీయాలకు పాల్పడుతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. పసిపిల్లల పేపర్లు లీక్ చేసి బీజేపీ క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతుంతోందని అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదర్కొవాలి, కానీ దిగజారిన, దిక్కుమాలిన రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. బండి సంజయ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన భూకాయిస్తున్నారని ఆరోపించారు.
బజేపీ కుట్రలను విద్యార్థులు గమనించాలని సూచించారు. బీజేపీ పార్టీకి చదువు విలువ తెలియదని, అందులో చదువుకున్నోళ్లు తక్కువగా ఉన్నారన్నాని అన్నారు. గల్లి నుంచి ఢిల్లీ వరకు ఫేక్ సర్టిఫికెట్ కలిగిన వాళ్లే ఉన్నారని ఆరోపించారు. పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన కుట్రదారు అని, తాండూరులో లీకేజీకి పాల్పడిన ఉపాధ్యాయుడు బీజేపీ ఉపాధ్యాయ సంఘం లో ఉన్నాడని ఆరోపించారు. అదేవిధంగా వరంగల్ అరెస్ట్ అయిన ప్రశాంత్ కూడా బీజేపీలో ఉన్నాడని వివరించారు.
గతంలో బీజేపీ అధినేతలతో ప్రశాంత్ దిగిన ఫోటోలను మంత్రి విడుదల చేశారు. లీకేజీ జరిగిందని ఉదయం బీజేపీ నేతలు ధర్నా చేశారని, సాయంత్రం అరెస్ట్ చేసిన వ్యక్తులను విడుదల చేయాలని బీజేపీ నేతలు ధర్నా చేయడంలోనే బిజెపికి సంబంధం ఉందని తేలిపోయిందన్నారు. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా కూడా సంజయ్ ను సమర్థించడం సిగ్గుచేటన్నారు. పదో తరగతి ప్రశ్నాపత్నం వాట్సాప్ లో ప్రచారం చేసిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్త కాదా.. ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ లో ప్రశాంత్ పంపింది నిజమా కాదా అని ప్రశ్నించారు.
రెండు గంటల్లో ఒక వంద నలభై రెండు సార్లు నీతో నిందితుడు మాట్లాడింది నిజమా కాదా అని బండి సంజయ్ ని మంత్రి హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. ప్రశ్నపత్రాలు నిందితుడు పంపితే తప్పేమిటని ఎమ్మెల్యే రఘునందన్ రావు నీసిగ్గుగా సమర్ధించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్నారు. పోలీసులు నిష్పక్షంగా వ్యవహరించి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ చార్జి ఎమ్మెల్సీ మల్లేశం, ఇప్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మల్లికార్జున గౌడ్, తదితరులు ఉన్నారు.