సిద్దిపేట సిగలో మరో మణిహారం శిల్పారామం: మంత్రి తన్నీరు హరీష్ రావు

by Shiva |
సిద్దిపేట సిగలో మరో మణిహారం శిల్పారామం: మంత్రి తన్నీరు హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట సిగలో మరో మణిహారం శిల్పారామమని అని ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు ఆవరణలో రూ.25 కోట్లతో నిర్మించనున్న శిల్పారామం నిర్మాణ పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేటకు విమానం, సముద్రం రెండే లేవుని, కాబట్టి త్వరలో కోమటి చెరువు వద్ద ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రంగనాయక సాగర్ గుట్టను డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. వచ్చే నెలలో కోమటి చెరువు రాక్ గార్డెన్ ఆవరణలో డైనోసార్ పార్క్ రాబోతోందని వెల్లడించారు. కోమటి చెరువు చుట్టూ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. శిల్పారామంలో చిన్న పిల్లలకు వారి అభిరుచులకు అనుగుణంగా ఉండే యాక్టివిటీలు కూడా నేర్పిస్తారిని తెలిపారు. ఆలయాలకు నిలయం, రిజర్వాయర్ల ఖిల్లాగా సిద్ధిపేట జిల్లా రుపుదిద్దుకొందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయం నుంచి కోమటి చెరువు సుందరీకరణ ప్రారంభించినట్లు గుర్తు చేశారు.

కోమటి చెరువు అభివృద్ధి కోసం ప్రతి శాఖ నుంచి నిధులు సమకూర్చినట్లు స్పష్టం చేశారు. అంతకు ముందు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి అడిటోరియంలో జిల్లాలోని మూడు వందల మంది ఎస్సీ కులాల లబ్దిదారులకు మంత్రి హరీష్ రావుతో కలిసి రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెక్కులు, మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజాశర్మ, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ మున్సిపాల్ చైర్మన్ రాజనర్సు, మున్సిపాల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మంత్రి హరీష్ రావు ఓ వారియర్..

మంత్రి హరీష్ రావును చూసి నేర్చుకోవాలంటే అతనో పుస్తకమని అని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హరీశ్ రావు వారియర్-యుద్ధ సమయ నాయకుడని అతని నుంచి ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటామన్నారు. సిద్దిపేట పట్టణం తెలంగాణకు ఒక రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. త్వరలోనే కోమటి చెరువు మంచి పర్యాటక ప్రాంతంగా రుపుదిద్దుకోనుందని మంత్రి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed