గజ్వేల్ ఘర్షణలపై నిష్పక్షపాతంగా విచారణ.. పోలీస్ కమిషనర్ శ్వేత

by Sumithra |
గజ్వేల్ ఘర్షణలపై నిష్పక్షపాతంగా విచారణ.. పోలీస్ కమిషనర్ శ్వేత
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : గజ్వేల్ ఘర్షణల పై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నట్లు పోలీస్ కమిషనర్ శ్వేత ప్రకటనలో తెలిపారు. టెక్నాలజీ, సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా 17 మంది నింధితులను గుర్తించి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదనన్నారు. గజ్వేల్ లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 5వందల మంది పోలీస్ అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే షికార్లు, పుకార్లు నమ్మవద్దన్నారు.

Advertisement

Next Story

Most Viewed