ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్

by samatah |
ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్
X

దిశ, కొండపాక: ప్రమాదవశాత్తు కల్వర్టును కారు ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాళ్లోకి వేళ్తే.. మేడ్చల్ మల్కజిగిరి జిల్లా బాచ్ పల్లి లోని శిల్ప బృందవనం‌కి చెందిన నుతక్కి నికిల్ కరీంనగర్ లోని ఓ ప్రైవేటు దవాఖానాలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్ళాడు. తిరిగి కరీంనగర్లో డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు మంగళ వారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బయలుదేరినాడు. మార్గ మధ్యలో సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ శివారు‌లో గాయత్రీ దేవి టెంపుల్ దగ్గర ప్రమాదవశాత్తు నిద్ర మత్తు లో కల్వర్ట్‌ను ఢీ కొన్నాడు . ఈ ప్రమాదం‌లో నుతక్కి నికిల్ అక్కడిక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

Advertisement

Next Story