నంగునూరులో నిరుపయోగంగా ఉన్న గెస్ట్ హౌస్

by Aamani |
నంగునూరులో నిరుపయోగంగా ఉన్న గెస్ట్ హౌస్
X

దిశ,నంగునూరు: నంగునూరు మండల కేంద్రంలో నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ద్వారా రూ 27.50 లక్షల అంచనాలతో నిర్మించిన విశ్రాంతి భవనం నిరుపయోగంగా మారింది. నంగునూరులో వివిధ శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగపడే విధంగా ఐకెపి భవనం పక్కనే గెస్ట్ హౌస్ నిర్మించారు. అప్పటి మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు చేతుల మీదుగా 3 మే 2023న ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు డోర్లు తీసిన పాపాన పోలేదు. వాడకంలో లేకపోయేసరికి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది.

భవనాన్ని వాడుకోలోకి తీసుకువచ్చినట్లయితే ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామ పంచాయతీ భవనం ఇందిరమ్మ కాలంలో నిర్మించింది. ఉండడంతో అందులోనే విధులు నిర్వహిస్తున్నారు. గెస్ట్ హౌస్ ను గ్రామపంచాయతీ కానీ, లేదా ఇతర శాఖలకు గాని కేటాయించి నట్లయితే ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పాత తహసీల్దార్ కార్యాలయం సైతం నిరుపయోగంగా మారింది. పాత తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో దానిని కూల్చివేయకుండా పక్కనే మరో భవనాన్ని నిర్మించారు అందులో అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ పాత భవనాన్ని కూల్చివేయకుండా నిరుపయోగంగా వదిలేశారు. నిరుపయోగంగా ఉన్న భవనాలను వాడుకలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Advertisement

Next Story