Surya Pratap Sahi : ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాంటి ప్రాసెసింగ్‌ను ప్రవేశపెడతాం

by Aamani |
Surya Pratap Sahi : ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాంటి ప్రాసెసింగ్‌ను ప్రవేశపెడతాం
X

దిశ,ములుగు : శ్రీ రామ సీడ్స్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఉత్తర ప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి బృందం సందర్శించారు. ములుగు మండలంలోని బండమైలారం గ్రామంలో గల ఆగ్రో ప్రాసెసింగ్ సీడ్ పార్క్ ను బుధవారం ఉత్తర ప్రదేశ్ బృందం సందర్శించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా స్టోరేజ్ పార్క్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ జరుగుతున్న వివిధ కార్యకలాపాలను సందర్శించడం జరిగిందన్నారు. వాటిని ఉత్తర ప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సూర్య ప్రతాప్ సాహి ప్రత్యేకంగా పరిశీలించారు. విత్తన ప్రాసెసింగ్, ప్యాకింగ్, టెస్టింగ్, స్టోరేజ్ సంబంధించిన విషయాలను పరిశీలించారు.

శ్రీ రామ సీడ్స్ చైర్మన్ శ్రీ చుండూరి రాంబాబు ఇక్కడ జరిగే అన్ని కార్యకలాపాలను వారికి వివరించారు. ఈ కార్యక్రమం లో బల్దేవ్ సింగ్ వ్యవసాయ సహాయ మంత్రి, రవీంద్ర ఉత్తర ప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అవనిష్ కుమార్, అవాస్త, ముఖ్యమంత్రి సలహా దారు, తెలంగాణా వ్యవసాయ అధికారులు సిద్ధిపేట జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, ములుగు డివిజన్ ఏ డీ ఏ అనిల్ కుమార్ ములుగు మండల వ్యవసాయ అధికారి ప్రగతి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story