వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి : సిద్దిపేట కలెక్టర్

by Aamani |
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి : సిద్దిపేట కలెక్టర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ అల్ప సంఖ్యాకుల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను మంగళవారం కలెక్టర్ సందర్శించారు. విద్యాసంస్థలో 75 శాతం మైనార్టీలకు, 25 శాతం ఇతరులకు సీట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 287 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నటు ప్రిన్సిపల్ భాను ప్రకాష్ కలెక్టర్ కు తెలిపారు. దాదాపు సగానికి పైగా సీట్లు ఖాళీగా ఉండటం పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో మైనార్టీ గురుకులాల్లో విద్యార్థులు చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ మను చౌదరి మాట్లాడి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపారు. కఠిన సబ్జెక్టులను ఎక్కువ సార్లు అభ్యసించి ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి మీ కుటుంబానికి విద్య సంస్థకు మంచి పేరు తీసుకురావాలన్నారు. డార్మెంటరీ గదిలో ఫ్యాన్లు ఏర్పాటు, స్పోర్ట్స్ మెటీరియల్ ఇతరత్రా అన్ని సౌకర్యాలు కల్పిస్తానని కలెక్టర్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ మను చౌదరి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్. గోపాల సుదర్శనం రచించిన "ఫైనాన్షియల్ లిటరసీ' (ఆర్థిక అక్షరాస్యత) పుస్తక ఆవిష్కరణ సమావేశంలో కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Next Story