Medak: అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం.. కఠిన చర్యలు తీసుకోవాలని దళితసంఘాల డిమాండ్

by Ramesh Goud |
Medak: అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం.. కఠిన చర్యలు తీసుకోవాలని దళితసంఘాల డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దళితసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శివంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్ పల్లిలో మంగళవారం రాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి పారిపోయారు. దీనిపై నిరసన తెలుపుతూ బుధవారం దళిత సంఘాల నాయకులు రోడ్డెక్కారు. దుండగులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు కోరుతున్నారు.

Advertisement

Next Story