Massive Flood complaints : వరద సహాయ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదుల వెల్లువ.. అత్యధికంగా ఆ జిల్లా నుంచే

by Ramesh N |   ( Updated:2024-09-02 14:58:12.0  )
Massive Flood complaints : వరద సహాయ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదుల వెల్లువ.. అత్యధికంగా ఆ జిల్లా నుంచే
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సెక్రటేరియట్ లోని వరద సహాయ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు 120 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. ఇందులో అత్యధికంగా ఖమ్మం జిల్లా నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఆయా జిల్లాల్లో పరిస్థితుల మేరకు ఇప్పటి వరకు 69 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు 2761 మంది పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం.

కాగా, భారీ వర్షాల కారణంగా ఆదివారం సెక్రటేరియెట్ గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 34 లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్‌కు 040-23454088 ఫోన్ నంబర్‌ను కేటాయించారు. వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సంప్రదించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు, తగు సూచనలు కంట్రోల్ రూమ్ ద్వారా అందిస్తారు.

Advertisement

Next Story