కమాండర్​ రాజేశ్‌ది బూటకపు ఎన్​కౌంటర్:​ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్​

by Satheesh |
కమాండర్​ రాజేశ్‌ది  బూటకపు ఎన్​కౌంటర్:​ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తెలంగాణ–ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల సరిహద్దుల్లోని పుట్టపాడు అటవీ ప్రాంతంలో జరిగింది బూటకపు ఎన్​కౌంటర్ ​అని మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్​ పేర్కొన్నారు. ఈ మేరకు లేఖ విడుదల చేసిన ఆజాద్​బూటకపు ఎన్​కౌంటర్‌లో కమాండర్​రాజేశ్, మరో దళ సభ్యుడు చనిపోయినట్టు తెలిపారు. ఎస్సెల్లార్​గన్ దొరికిందని పోలీసులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. కమాండర్​రాజేశ్​పార్టీ పనుల నేపథ్యంలో ఒంటరిగా పుట్టపాడు గ్రామానికి వెళ్లినట్టు తెలిపారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతన్ని పట్టుకుని చిత్రహింసలకు గురి చేసి ఆ తరువాత కాల్చి చంపినట్టు ఆరోపించారు. ఇది నిజమైన ఎన్​కౌంటర్​అని నమ్మించటానికి తమతో పాటు తెచ్చుకున్న ఎస్సెల్లార్ తుపాకీని అక్కడ పెట్టారన్నారు.

పుట్టపాడు గ్రామానికి చెందిన నందాల్​అనే అమాయక ఆదివాసీని కూడా పోలీసులు కాల్చి చంపినట్టు తెలిపారు. ఒక నిరాయుధున్ని, గ్రామస్తున్ని పట్టుకుని చంపి ఎన్​కౌంటర్​అని చెబుతున్నారని పేర్కొంటూ ఇది పోలీసుల పిరికి పంద చర్య అని అభివర్ణించారు. బీఆర్ఎస్ పార్టీల నాయకులు, ఎస్పీ వినీత్, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ అశోక్‌లు ఈ హత్యలకు పూర్తి బాధ్యులని పేర్కొన్నారు. ఛత్తీస్​గఢ్​రాష్ర్టం సుక్మా జిల్లా కంగాల్​గ్రామానికి చెందిన రాజేశ్​తన 19వ యేటనే విప్లవోద్యమంలోకి వచ్చినట్టు తెలిపారు. 2016 నుంచి 2022 అక్టోబర్​వరకు చర్ల ఎల్వోఎస్​సభ్యునిగా పని చేసినట్టు చెప్పారు. 2022, అక్టోబర్‌లో ఎల్వోఎస్​కమాండర్‌గా ప్రమోట్​అయినట్టు పేర్కొన్నారు. ​

Advertisement

Next Story