- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: మరికొన్ని గంటల్లో పోలింగ్.. ఓటర్లకు కీలక పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ..!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. నాలుగో విడతలో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ ఓటర్లకు కీలక పిలుపునిచ్చింది. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు సూచించింది. ఈ మేరకు శనివారం తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లో కరపత్రాలు కలకలం రేపాయి. వాజేడు మండలం జగన్నాథపురం వై జంక్షన్ దగ్గర మావోయిస్టు వాల్ పోస్టర్లు, కరపత్రాలు ప్రత్యక్షమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని ఈ కరపత్రాల ద్వారా మావోయిస్టులు పిలుపునిచ్చారు. వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ పేరుతో ఈ కరపత్రాలు, వాల్ పోస్టర్లను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న వేళ మావోయిస్ట్ కరపత్రాలు కలకలం రేపడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏజెన్సీ ఏరియాలో భారీగా భద్రత బలగాలను మోహరించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.