ఓయూ పీహెచ్ డీ అడ్మిషన్లలో బహుజనులకు అన్యాయం

by Javid Pasha |
ఓయూ పీహెచ్ డీ అడ్మిషన్లలో బహుజనులకు అన్యాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్ డీ అడ్మిషన్ల ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విజ్ఞప్తిచేశారు. అన్ని యూనివర్సిటీలకు భిన్నంగా పీహెచ్ డీ ప్రవేశ పరీక్షలో ఎన్నడూలేని విధంగా బహుజన విద్యార్థులకు 45 శాతం క్వాలిఫై మార్క్స్ పెట్టి ర్యాంక్స్ ప్రకటించడం సరైన పద్ధతి కాదని గురువారం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ను వీసీ కాలరాశారని మంత్రికి వివరించారు. రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పీహెచ్ డీ ప్రవేశ పరీక్ష రాసితే అర్హత దక్కించుకుంటున్నారని, ఇక్కడ మాత్రం ఎందుకు అలా పాటించడంలేదన్నారు.

బీసీ విద్యార్థులకు 20 శాతం, ఓసీ విద్యార్థుల అర్హతకు 25 శాతంగా పెట్టాలన్నారు. పరిశోధన విలువలు పాటించకుండా మెథడాలజీ ప్రశ్నలు లేకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఒకే రిజర్వేషన్ పద్ధతిన పెట్టడం వల్ల బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. వీసీ అనాలోచిత నిర్ణయాల వల్ల పీహెచ్ డీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించింది కేవలం 20 శాతం విద్యార్థులేనని వారు పేర్కొన్నారు. అందుకే బహుజన విద్యార్థులకు న్యాయం చేయాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విద్యార్థులపై గతంలో పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని మంత్రిని డిమాండ్ చేశారు

Advertisement

Next Story