Maheshwar Reddy: రైతులకు భరోసా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది.. మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

by Shiva |
Maheshwar Reddy: రైతులకు భరోసా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది.. మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు భరోసా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Eleti Maheshwar Reddy) ఆరోపించారు. ఇవాళ ఆయన బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా పంట నష్ట పరిహారాన్ని వెంటనే రైతుల జమ చేస్తామని కాంగ్రెస్‌ (Congress) తమ మేనిఫెస్టోలో పొందుపరిచిందని గుర్తు చేశారు. రైతులకు కనీస భరోసా ఇవ్వలేని స్థితిలో సర్కార్ ధ్వజమెత్తారు. సొంత జిల్లా ఖమ్మం ప్రజలకు కూడా పంట పరిహారం ఇప్పించలేని స్థితిలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు (Minister Thummala Nageshwar Rao) ఉన్నారని ఎద్దేవా చేశారు. ఓ మంత్రిగా ఆయన పూర్తిగా వైఫల్యం చెందడం బాధకరమని పేర్కొ్న్నారు.

రాష్ట్రంలో రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ అయిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అబద్ధాలు చెబుతున్నారని ఆక్షేపించారు. మరోవైపు మంత్రి తుమ్మల రూ.13 వేల కోట్లను త్వరలోనే రుణమాఫీ కింద విడుదల చేస్తామని స్టేట్‌మెంట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడ ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. రైతు భరోసా విషయంలో ఇప్పటి వరకు మంత్రులకే క్లారిటీ లేదని ఫైర్ అయ్యారు. రైతు సమస్యలపై బీజేపీ దీక్ష చేస్తే.. సీనియర్ మంత్రి తుమ్మల పక్కదోవ పట్టించేలా స్టేట్‌మెంట్లు ఇవ్వడం బాధకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రుణమాఫీ కానీ రైతుల ఖాతాల్లో రూ.2 లక్షలు వెంటనే జమ చేయాలని మహేశ్వర్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed