రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. మాజీ మంత్రి

by Sumithra |
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. మాజీ మంత్రి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. శనివారం స్థానిక పాలిటెక్నిక్ కళాశాల బాలికల బాత్రూమ్ లో సెల్ ఫోన్ ఉంచి విడియో తీసిన సంఘటన పై ఆయన ఆదివారం కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యలతో ఆడపిల్లలను కన్నెత్తి చూడాలంటేనే భయపడే పరిస్థితులుండేవని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇటీవలే ఆడపిల్లలు, మహిళల పై వేధింపులు పెరిగిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పాఠశాలలు, కళాశాలలో పూర్తి స్థాయి వసతులతో విడివిడిగా మూత్రశాలలు ఏర్పాటు చేయాలని, విద్యార్థినుల సమస్యల పై తరచూ సమావేశాలు నిర్వహించి వారి బాధలు, ఇబ్బందులు తెలుసుకోవాలని, కళాశాలలో వారికి కావలసిన సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు. తన హాయాంలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక సెంటర్ నిర్మాణంకు శంఖుస్థాపన చేసుకున్నామని, అందుకు 25 కోట్ల నిధులు కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు తీసుకొచ్చామన్నారు. బాలికల బాత్రూమ్ లో ఫోన్ పెట్టిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంబడి నాయకులు రాజేశ్వర్ గౌడ్, ఆంజనేయులు, శివరాజ్, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed