దిశ ఎఫెక్ట్.. పాలెం కళాశాలలో MA తెలుగు కొనసాగింపు

by Javid Pasha |   ( Updated:2022-12-04 14:29:41.0  )
దిశ ఎఫెక్ట్.. పాలెం కళాశాలలో MA తెలుగు కొనసాగింపు
X

దిశ, బిజినేపల్లి: ఎంఏ అడ్మిషన్లలో భాగంగా సెకండ్ ఫేజ్ లో ఇచ్చిన వెబ్ ఆప్షన్లలో పాలెం పీజీ కాలేజ్ లో MA తెలుగు ఆప్షన్ కానరాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. ఈ సమస్యను వివరిస్తూ దిశ పత్రికలో వార్తా కథనం వెలువడింది. అయితే తాజాగా దిశ వార్తా కథనానికి సంబంధిత కాలేజ్ స్పందించింది. సెకండ్ విడత కౌన్సిలింగ్ లో MA తెలుగు ఆప్షన్ రాకపోవడం నిజమేనని, కానీ మూడో విడత కౌన్సిలింగ్ లో MA తెలుగు ఆప్షన్ పెట్టుకోవచ్చని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్ ఆప్షన్లు ఈ నెల 6, 7వ తేదీలలో ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. పాలెం కళాశాలలో ఎంఏ తెలుగు చేసే విద్యార్థులకు 25వేల పుస్తకాలతో కూడిన గ్రంథాలయం, సీనియర్ అధ్యాపకులు ఉన్నారని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed