వినియోగదారులకు రక్షణ కల్పిస్తాం

by Naveena |
వినియోగదారులకు రక్షణ కల్పిస్తాం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మోసపోయినా,నష్టం జరిగినా వినియోగదారులకు రక్షణ కల్పిస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు అన్నారు. మంగళవారం జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా..స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వినియోగదారుల హక్కుల గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా..ఆశించిన ఫలితాలు కనబడటంలేదని,తాము మోసపోతున్నా గుర్తించకుండా నష్టపోతూనే ఉన్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెస్తున్నా,నకిలీలు పెరిగిపోతున్నాయని,అవగాహన లేమితో ప్రజలు మోసపోతూనే ఉన్నారని,ప్రజల బలహీనతలను బట్టి వ్యాపారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వినియోగదారులకు ఎన్నో హక్కులు,చట్టాలు ఉన్నాయని,వస్తు సేవల విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే,వాటి విలువ ఆధారంగా జిల్లా,రాష్ట్ర జాతీయ కమీషన్లను ఆశ్రయించవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ వెంకటేష్,జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి,లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ రవీందర్ రావు,డిఇఓ ప్రవీణ్ కుమార్,విజయ్ మోహన్ రెడ్డి,బాలలింగయ్య,న్యాయవాది ఆడమ్స్,ఎన్సీఆర్సీ స్టేట్ చైర్మెన్ బునేడు బాల్ రాజ్,జిల్లా గౌరవాధ్యక్షుడు శివశంకర్,జిల్లా అధ్యక్షుడు మాదమోని చందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed