తరుగు పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు : మంత్రి జూపల్లి

by Aamani |
తరుగు పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు : మంత్రి జూపల్లి
X

దిశ, వీపనగండ్ల: ప్రభుత్వ ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తరుగు పేరుతో రైతులను వేధిస్తే అధికారులతో పాటు మిల్లర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గోవర్ధనగిరి,వీపనగండ్ల,సంగినేనిపల్లి గ్రామాలలో సెర్ప్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు తరలించి రైతుల ఖాతాలో వెంటనే డబ్బులు జమ అయ్యేలా చూడాలని సివిల్ సప్లై అధికారి రమేష్ బాబుకు చరవాణి లో సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఐకెపి సిబ్బంది వెంటనే రసీదులు ఇవ్వాలని, అందులో సూచించిన తూకం ప్రకారం రైతులకు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత అధికారులదేనని, ధాన్యాన్ని మిల్లులకు తరలించిన తర్వాత మిల్లర్లు ధాన్యాన్ని తరుగులు తీసివేస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీలపై పై అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని స్థానిక వ్యవసాయ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ను మంత్రి జూపల్లి చరవాణిలో ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్డిఓ ఉమాదేవి, ఏపిఎం బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డా"గోదల బీరయ్య యాదవ్, వనపర్తి జిల్లా ఎంపిటిసిల ఫోరమ్ మాజీ అధ్యక్షుడు ఇంద్రకంటి వెంకటేష్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఐకెపి గ్రామ అధ్యక్షురాలు ఎత్తం చిట్టెమ్మ, దయపు ఎల్లమ్మ, రైతుబంధు సమితి మండల మాజీ అధ్యక్షులు ఎత్తం కృష్ణయ్య, నారాయణరెడ్డి,మాజీ సర్పంచ్ గంగిరెడ్డి, నాయకులు సుదర్శన్ రెడ్డి, బస్వరాజు గౌడ్, నక్క విష్ణు, రవీందర్ రెడ్డి,చిన్నారెడ్డి, గోపి, చక్ర వెంకటేష్, పెంటయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed