రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాక..

by Sumithra |
రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాక..
X

దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ నుండి విశాఖపట్నం రైలును ప్రారంభించడానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి శనివారం జిల్లా కేంద్రానికి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సిహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్ నగర్ నుండి విశాఖపట్నం బయలుదేరే ట్రైన్ నెంబర్ 12862 గల ఎక్స్ ప్రెస్ రైలును ఆయన సాయంత్రం 4 గంటలకు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్మెన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ కేసీ నర్సింహులు తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

ప్రతి రోజు సాయంత్రం 4-10 గంటలకు మహబూబ్ నగర్ లో బయలుదేరి, కాచీగూడ, రాయనపాడు(విజయవాడ), ఏలూరు, రాజమండ్రి, అన్నవరం మీదుగా మరుసటిరోజు ఉదయం 6-50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని, పెద్దలకు, స్లీపర్ కోచ్ రిజర్వేషన్ తో కలిపి 450 రూపాయలు, పిల్లలకు 300 రూపాయల చార్జీ ఉంటుందని, ఈ సౌఖర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగపరచుకోగలరని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా.. మహబూబ్ నగర్ నుండి విశాఖపట్నం రైలును ప్రారంభించే నిమిత్తమై పాలమూరుకు వస్తున్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ముందుగా మధ్యహ్నం 12-30 గంటలకు స్థానిక బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయానికి రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడ మధ్యహ్నం 1 గంటకు విలేఖరుల సమావేశ ఉంటుందని అనంతరం సాయంత్రం 3-30 గంటలకు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కు బయలుదేరి మంత్రి నూతన రైలును ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed