- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై కలెక్టర్ సమీక్ష
దిశ,నారాయణపేట ప్రతినిధి :సర్వే పూర్తి చేసి ఎంపీడీవో కార్యాలయాల్లో డాటా ఎంట్రీ చేయించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లా రెవెన్యూ, ఆదనపు కలెక్టర్ బేన్ షాలంతో కలిసి అధికారులతో సమీక్ష జరిపారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా స్టిక్కరింగ్ ఎంతవరకు వచ్చిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని గ్రామాలలో స్టిక్కరింగ్ నెమ్మదిగా కొనసాగుతుందని,వెంటనే వేగవంతం చేయాలని ఆమె సూచించారు. సూపర్ వైజర్లు మధ్యాహ్నం నుంచి క్షేత్రస్థాయిలో సర్వేను పర్యవేక్షించాలన్నారు. సూపర్ వైజర్ల తో డిపిఓ, సిపిఓ లు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, సర్వే ను స్పీడ్ అప్ చేసే విధంగా ఆదేశించాలన్నారు. అలాగే ఎంపీడీవోలు, ఎంఈఓ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి.. సర్వే వేగవంతానికి ఆదేశాలు జారీ చేయాలని జిల్లా రెవెన్యూ, అదనపు కలెక్టర్ బెన్ షాలం కు సూచించారు. డాటా ఎంట్రీ కి అవసరమైన కంప్యూటర్లను,ఆపరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. శని ,ఆదివారాలలో కూడా సర్వే కొనసా:సర్వే పూర్తి చేసి ఎంపీడీవో కార్యాలయాల్లో డాటా ఎంట్రీ చేయించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.గించాలని, సెలవులు లేవని ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై చాలా ఫోకస్ పెట్టిందని,సర్వే ను వీలైనంత త్వరగా ఎలాంటి తప్పులు లేకుండా అన్ని కాలాంశాల వివరాలను నమోదు చేసి పూర్తిచేయాలని ఆదేశించారు.
అనంతరం జిల్లాలో వరి,పత్తి కొనుగోళ్లపై ఆమె అధికారులతో చర్చించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలలో సన్న,దొడ్డు రకం వడ్ల కొనుగోలుకు రెండు కౌంటర్లను పెట్టాలని సూచించారు. జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు చేయాలని చెప్పారు.కేంద్రాలలో బ్యానర్,ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రోజు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు జరిగిందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. వీలైనంత తొందరగా కేంద్రాలకు అవసరమైన గన్ని బ్యాగులను సమకూర్చాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాములలో నిల్వ చేయాలని తెలిపారు. చివరగా జిల్లాలోని 5 జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోలు ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. డిపిఓ కృష్ణ, సిపిఓ యోగానంద్, సివిల్ సప్లై మేనేజర్ దేవదాస్, జిల్లా సివిల్ సప్లై అధికారి సుదర్శన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, మార్కెటింగ్ శాఖ అధికారిని బాలమణి పాల్గొన్నారు.