సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

by Naveena |
సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ప్రెస్ క్లబ్ 'ఫైవ్ మెన్' కమిటీ సభ్యులు అన్నారు.స్థానిక మెట్టుగడ్డలో ఉన్న ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ వేసిన 'ఫైవ్ మెన్ కమిటీ'సభ్యులు పి.రవికుమార్,గాజుల బస్వరాజు,గుముడాల గోవర్థన్,జెమిని శేఖర్ గౌడ్,వాకిట అశోక్ కుమార్ లను నియమించినట్లు వారు తెలిపారు. ఈ ఫైవ్ మెన్ కమిటీ నేతృత్వంలో ప్రెస్ క్లబ్ ఆధునీకరణకు మార్గదర్శకాలు,జర్నలిస్టుల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు రెండు మార్లు సమావేశాలు నిర్వహించామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కొన్ని విధివిధానాలు రూపొందించామని,ఇందులో ప్రధానంగా ప్రెస్ క్లబ్ ఆధునీకరణ,గ్రూప్ ఇన్స్యూరెన్స్ తదితర అనేక నిర్ణయాలను తీసుకునామన్నారు.ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం కోసం కొన్ని నిబంధనలు విధించామని,ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ సంవత్సరం 'మే' 17 వ తేదీ వరకు కొనసాగుతుందని వారు తెలియజేశారు.ఈ సందర్భంగా కొందరు జర్నలిస్టులు సభ్యత్వాన్ని తీసుకొన్నారు.

Next Story