- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేవాలయాన్ని ఢీకొట్టిన బియ్యం లారీ.. తప్పిన పెను ప్రమాదం
దిశ, మక్తల్: మక్తల్ పట్టణం వెలుపల పెద్ద చెరువు క్రింద ఉన్న ఈదెమ్మ దేవాలయాన్ని బియ్యం లారీ డీ కొట్టింది. దీంతో గర్భగుడి మినహా మొత్తం గుడి కూలిపోయింది. ఈ సంఘటన మంగళవారం రోజు తెల్లవారుజామున జరగ్గా.. లారీ ముందు ముందు భాగం తీవ్రంగా దేబ్బ తిన్న డ్రైవర్‌కి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాదాపు మూడు లారీల్లో 70 టన్నుల సన్న బియ్యం కర్ణాటకలోని హుబ్లీకి తరులుతున్న అక్రమమా సక్రమమా అని తేలియాల్సి ఉంది. వివరాల్లోకెళ్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడకు అధికార పార్టీ చెందిన ఓ నాయకుని అండదండలతో ఓ రైస్ మిల్లు యజమాని నాలుగు లారీల్లో హుబ్లీకి సన్న రకం బియ్యం తరలిస్తున్న క్రమంలో మక్తల్ చెరువు కట్ట కింద ఉన్న అతి పురాతన మైన ఈదెమ్మ దేవాలయాన్ని ఢీకొట్టింది. దీంతో గర్భగుడి మినహా ముందు ఉన్న ఆవరణ మొత్తం కూలిపోయింది.
ఇటీవల జాతీయ రహదారి రోడ్డు వెడల్పు సందర్భంగా దేవాలయానికి ఇరువైపులా రోడ్డుని ఫార్మషన్ చేశారు. దేవాలయాన్ని రోడ్డుకు ఎడమవైపు స్థలంలో అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మానం చేయాలని భక్తులు చెప్పినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది కలిగింది. దాదాపు వందలాది వాహనాలు తిరిగి ఈ రోడ్డులో దేవాలయం దగ్గర ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని రోడ్డు నిబంధనలు చెప్తున్నాయి.
స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి చొరవ తీసుకుని అమ్మవారి భక్తులతో మాట్లాడి చెరువు కట్టపై ఆలయ నిర్మాణం కొనసాగింది. సదరు కాంట్రాక్టర్ ప్రమాద సూచికలు పెట్టాల్సి ఉన్న సదరు రహదారి రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు ఆరు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ప్రమాదానికి కారణమైన లారీలో ఉన్న బియ్యం రవాణాకు పర్మిట్ ఉందా లేదా అన్నది అధికారులు తేల్చాల్సి ఉంది.