- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమిత్ షా బర్తరఫ్ కు కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం పట్టణంలో కదం తొక్కారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యుడు చల్లా వంశీచంద్ రెడ్డి,ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి,జి.మధుసూధన్ రెడ్డి,అనిరుధ్ రెడ్డి,స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్ లు మాట్లాడుతూ..బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే నేడు అమిత్ షా హోం మంత్రి పదవిలో ఉన్నాడని,వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలన్నారు. దేశానికి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అంతకు ముందు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మోహన్ రావు కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్,వైస్ చైర్మెన్ షబ్బీర్ అహ్మద్,గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహారెడ్డి,మూడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మెన్ బెక్కెరి అనిత,వైస్ చైర్మెన్ విజయ్ కుమార్,సిరాజ్ ఖాద్రీ,ఎన్పీ వెంకటేష్,సిజె బెనహర్ తదితర నాయకులు పాల్గొన్నారు.