- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'తిరుపతి'ని తలపించేలా మన్యంకొండ.. Minister Srinivas Goud
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: తిరుపతిని తలపించేలా మన్యంకొండ దేవాలయాన్ని దివ్య క్షేత్రంగా రూపొందిస్తామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయం స్టేట్ చాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకనాడు మునులకుండగా ఉన్న మన్యంకొండ పేదల తిరుపతిగా పేరు గడించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న దేవాలయాలలో అతి పెద్ద దేవాలయంగా గ్రేడింగ్ లో ప్రథమ స్థానంలో ఉందని మంత్రి చెప్పారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ క్షేత్రాన్ని తిరుపతికి ధీటుగా అభివృద్ధి తీర్చి దిద్దాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. సీఎం కేసీఆర్ దృష్టికి ఆలయ అభివృద్ధి ఆవశ్యకతను తీసుకెళ్లగా.. రూ. 50 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం 390 జీవోను జారీ చేసిందని చెప్పారు. ఈ నిధులతో పళని స్వామి దేవాలయం వద్ద ఉన్నట్లుగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రోప్ వే ను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. దీంతో పాటు అన్నదాన సత్రం, కల్యాణ కట్ట, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే రూ.15 కోట్లతో టూరిజం హోటల్ నిర్మాణం జరుగుతోందని, భక్తుల సౌకర్యార్థం 18 రూములతో వసతి సౌకర్యాలు కల్పించడం జరిగిందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో రూ.25 కోట్లు, వచ్చే ఏడాది మార్చిలో మరో రూ.25 కోట్ల నిధులు విడుదలవుతాయని మంత్రి పేర్కొన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి రూ.6 కోట్లు మంజూరు
పాలమూరు జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి సైతం ప్రభుత్వం రూ.6 కోట్లు మంజూరు చేసిందని, ఈ నిధులతో చేపట్టవలసిన అభివృద్ధి పనులను గురించి ఆలయ కమిటీ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. జిల్లాలో దేవాలయాలను అభివృద్ధి పరచడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. కోయిల్ సాగర్, ఉదండాపూర్, కరివేన రిజర్వాయర్లు పూర్తి అయిన తర్వాత ఆ ప్రాంతాలను కూడా పర్యాటక స్థలాలుగా రూపొందిస్తామని మంత్రి తెలిపారు. దాదాపుగా 9,800 కోట్ల రూపాయలతో అమర రాజా కంపెనీ వారు ఇక్కడ తమ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారని దీని ద్వారా దాదాపు 10 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఐటీ టవర్ సైతం పూర్తికావచ్చిందని చెప్పారు. భూత్పూర్- హన్వాడ మధ్య నిర్మించే బైపాస్ రోడ్డు పూర్తి అయితే ఈ ప్రాంతం వ్యాపారాత్మకంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
వలసల జిల్లా అనే పేరు నుంచి ఇతర ప్రాంతాల వాళ్లకు ఉపాధి కల్పించే దిశగా..
వలసల జిల్లా అనే పేరును చెరిపేసి... అభివృద్ధి చెందిన జిల్లాగా రూపొందించి... ఇతర దేశాలు, రాష్ట్రాల నుండి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చే విధంగా పాలమూరు జిల్లాను రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పాలమూరు జిల్లా అభివృద్ధిని గురించి మన రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీలోను గొప్పగా చెబుతుంటే ఎంతో ఆనందం వేస్తుందని మంత్రి చెప్పారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే కొంతమంది వాటిని భూతద్దంలో చూపే కుట్రలు చేస్తారని, వాటిని నమ్మొద్దని మంత్రి సూచించారు. అంతకుముందు ప్రొజెక్టర్ ద్వారా మన్నెంకొండ దేవాలయం, మినీ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనులను గురించి మీడియా కు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, సీతారామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కే.సి నర్సింలు, మన్యంకొండ, నరసింహ స్వామి దేవాలయాల పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.