స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర: మాజీ ఐఏఎస్ అధికారి

by srinivas |   ( Updated:2024-11-18 16:07:42.0  )
స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర:  మాజీ ఐఏఎస్ అధికారి
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు(TDP leader and CM Chandrababu) గత సంవత్సరం స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు(Skill Development Scam Case)లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 2014-19 చంద్రబాబు ప్రభుత్వం హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో స్కామ్ జరిగిందంటూ సీఐడీ పోలీసులు(CID Police) ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు నాయడు ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదల అయ్యాయి.


అయితే ఈ కేసుకు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్(Retired IAS officer PV Ramesh) ఓ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర జరిగిందని, అప్పటి సీఎంవోలోని పెద్దల ప్రమేయం ఉందన్నారు. అటు పోలీస్ శాఖలోనూ పలువురు సూత్రధారులు ఉన్నారని, కొందరు పదవుల్లో కొనసాగుతున్నారని చెప్పారు. అప్పట్లో తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వక్రీకరించారని, న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీజీపీకి లేఖ రాశానని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్‌కు సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయని అప్పటి సీఐడీ అధికారులు చెప్పడం అత్యంత హాస్యాస్పదమన్నారు. ఫైళ్ల మాయమని చెప్పడంలోనూ పెద్ద కుట్ర దాగి ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎంత త్వరగా ఈ కేసును నిగ్గు తేల్చితే అంతమంచిదని పీవీ రమేశ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story