MP Arvind: కేటీఆర్ అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి అవసరమా?

by Gantepaka Srikanth |
MP Arvind: కేటీఆర్ అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి అవసరమా?
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ(Musi) బాధితులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని బీజేపీ(BJP) నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(Arvind Dharmapuri) డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. మూసీ(Musi) ప్రక్షాళన కార్యక్రమం పాతబస్తీ నుంచే ప్రారంభం కావాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) బుల్డోజర్లకు పాతబస్తీ(Old City)కి వెళ్లే దమ్ము ఉందా? అని ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు.

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని కూల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కేటీఆర్ అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి అవసరమా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అంటూ తమ మీద నిందలు వేసి.. రేవంత్ రెడ్డే కేటీఆర్‌ను కాపాడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో గొప్పలకు పోయి ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిశాయని అన్నారు.

Advertisement

Next Story