- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జర్నలిస్టులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, మహబూబ్ నగర్: జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారి సంక్షేమం కోసం 100 కోట్ల నిధి ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇళ్ళ పట్టాలను పంపిణీ చేసి ప్రసంగించారు.
రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా మహబూబ్ నగర్ జర్నలిస్టులకే డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తామని చెప్పిన ప్రకారంగా, అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెడరేషన్ నాయకులు శామ్యూల్ సుందర్, రమాకాంత్ రెడ్డి, ఉమామహేశ్వరరావు, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు