- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాఠశాలలను సందర్శించిన రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దేవసేన..
దిశ, మరికల్: మండల కేంద్రంలోని బాలుర బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలను, తీలేరు ప్రాథమికోన్నత పాఠశాలను సోమవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దేవసేన సందర్శించారు. ఈ సందర్భంగా మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పూర్తిచేసిన పాఠశాల పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని విద్యార్థులతో ముచ్చటించి వారి నైపుణ్యాలను, ప్రతిభను వెలికితీయడానికి పాఠ్యాంశంలోని ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. విద్యార్థులు చెప్పిన సమాధానాలకు సంతృప్తి వ్యక్తం చేస్తూ చాక్లెట్లు పంచి పెట్టారు.
అనంతరం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మిస్తున్న నూతన పాఠశాల భవనాన్ని పరిశీలించి నాణ్యతగా నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ మాయాంక్ మిట్టల్, డీఈవో లియాకత్ అలీ, సర్పంచ్ లు రేవతమ్మ, గోవర్ధన్, ప్రధానోపాధ్యాయులు అనురాధ, ఎస్ఎంసి చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.