విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Satheesh |   ( Updated:2023-01-28 10:04:55.0  )
విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, పాలమూరు: విలీన గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి పట్టణానికి దీటుగా తీర్చిదిద్దుతానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ మున్సిపల్ పరిధిలోని చిన్నదర్పల్లి, పూజారి తండా తదితర గ్రామాల్లో రూ. 81లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహబూబ్నగర్ పురపాలికలో విలీనమైన గ్రామపంచాయతీలను ప్రత్యేక నిధులతో అద్భుతంగా అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. గతంలో తాగునీటికి కటకటలాడిన గ్రామాల్లో నేడు ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందజేయడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి త్వరలోనే రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింలు నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed