ఆర్‌టీసీపై యూట్యూబర్ వీడియో.. ట్విట్టర్లో పోస్ట్ చేసిన సజ్జనార్

by Disha News Desk |
ఆర్‌టీసీపై యూట్యూబర్ వీడియో.. ట్విట్టర్లో పోస్ట్ చేసిన సజ్జనార్
X

దిశ, అచ్చంపేట : బీకే తిరుమలాపూర్‌కు చెందిన యూట్యూబ్ శ్రీను ఆర్‌టీసీపై ఓ వీడియో చేశాడు. ఆ వీడియోను ఫేస్‌‌బుక్, వాట్సాప్‌లలో షేర్ చేశాడు. ఈ వీడియో ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌కు చేరింది. దీంతో సజ్జనార్ చేసిన పని అందరని ఆశ్చర్యపరిచింది. అయితే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని నల్లమల మారుమూల ప్రాంతమైన బీకే తిరుమలాపూర్ గ్రామానికి చెందిన నల్లమల యూట్యూబర్ చారగొండ శ్రీను మేడారం జాతరకు వెళ్లేందుకు ప్రజలు ఆన్‌లైన్ ద్వారా టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఆర్‌టీసీ విడుదల చేసిన యాప్‌ను ఎలా వినియోగించుకోవాలని ఈ వీడియోలో వివరించాడు.

పోస్ట్ చేసిన సజ్జనార్..

మేడారం జాతరకు ప్రజలు వెళ్లేందుకు ఆర్టీసీ టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని పొందుపర్చిన ప్రత్యేక యాప్‌ను ఆర్‌టీసీ విడుదల చేసింది. ఈ యాప్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయంపై నల్లమల్ల యూట్యూబర్ చారగొండ శ్రీను తీసిన వీడియోను సజ్జనార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సజ్జనార్ ఆర్టీసీ ఎండీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన శైలితో ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు.


Advertisement

Next Story