Phone Tapping:హైకోర్టులో మాజీ ఎస్బీ ఛీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్

by Ramesh Goud |
Phone Tapping:హైకోర్టులో మాజీ ఎస్బీ ఛీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ స్వీకరించి విచారించే అంశంలో హైకోర్టు వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ప్రభాకర్ రావు తరపున ఆయన న్యాయవాది పిటిషన్ ను దాఖలు చేస్తున్నారు. ప్రభాకర్ రావు ఎక్కడికి పారిపోలేదని క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్ ల చికిత్స కోసమే అమెరికా వెళ్లినట్టు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిగా చేర్చడానికి ముందే తాను అమెరికా వెళ్లినట్లు పేర్కోన్నారు. ప్రభాకర్ రావుకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదని అందువల్ల ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై విచారణ రెండు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్ పోల్ సహకారంతో రెడ్ కార్నర్ నోటీసులు అందజేసినట్లు సీఐడీ వర్గాలు తెలుపుతున్నాయి.

Next Story

Most Viewed