- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చిన్న వయసులోనే ఇంత దారుణమా.. అమ్మాయిల ఇన్‌స్టా హ్యాక్ చేసి.. ఈ బాలుడు ఏం చేశాడో చూడండి!?

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో కొందరు సైబర్ నేరాగాళ్లు సోషల్ మీడియా(Social Media) అకౌంట్లను హ్యాక్ చేసి వేధింపులకు గురి చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో డబ్బులను కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కి ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సైబర్ మోసాలపై పోలీసులు అవగాహన కల్పించిన చాలా మంది మోసపోతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో చాలా మంది పిల్లలు చిన్న వయసులోనే మొబైల్స్‌కు బానిసై చదువుకు దూరం అవుతున్నారు. స్మార్ట్‌పోన్ వచ్చాక వారి ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోయిందనడంలో ఆశ్చర్యం లేదు. మంచికి వినియోగించే వారు కొందరైతే.. మరికొందరు చెడుకి బానిసలవుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చూస్తే.. చిన్న వయసులోనే ఇంత నీచమైన ఆలోచనలు, ప్రవర్తనలు.. ఒకరిని చూసి ఇంకొకరు చెడిపోతున్నారనే అంటారు. ఇలాంటివి చిన్నప్పటి నుంచే అరికట్టాల్సిన బాధ్యత పేరెంట్స్ పై ఉంటుంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో 9వ తరగతి చదువుతున్న బాలుడు తన తోటి విద్యార్థినుల ఇన్‌స్ట్రాగ్రామ్(Instagram) అకౌంట్‌ను హ్యాక్ చేశాడు. దీంతో ఆ అమ్మాయిలను పలుమార్లు వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళితే.. 9వ తరగతి బాలుడు తోటి విద్యార్థినులైన ఐదుగురు అమ్మాయిల ఇన్‌స్టా హ్యాక్ చేసి.. వ్యక్తిగత ఫొటోలు మెసేజ్‌లను ఇతర క్లాస్ అబ్బాయిల ఫోన్‌కు పంపి కొన్ని నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేని విద్యార్థినులు ఏం చేయాలో తెలియక.. విషయం టీచర్లకు చెప్పారు.
దీంతో టీచర్ బాలుడిపై కోప్పడింది. టీచర్లు నాలుగు రోజుల క్రితం బాలుడిని మందలించి కొట్టారు. ఈ క్రమంలో బాలుడి తండ్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అసలు విషయం దాచి టీచర్లపై ఫిర్యాదు చేశారు. బాధిత బాలికలు పేరెంట్స్‌కి అసలు విషయం చెప్పారు. దీంతో బాలికల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఆ బాలుడి పై ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో బాలుడి వేధింపుల ఆరోపణలపై విచారణ చేపట్టిన ప్రొద్దుటూరు MEO సావిత్రమ్మ, రూరల్ సీఐ బాల మద్దిలేటి వేధింపులు నిజమేనని తేల్చారు. ఈ క్రమంలో బాలుడితో పాటు అతనికి అండగా ఉన్న తల్లిదండ్రుల పై పోలీసులు పోక్సో కేసు( నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.