- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Grok AI Is Now On Telegram: టెలిగ్రామ్‌లోనూ గ్రోక వచ్చు.. కానీ కండీషన్స్ అప్లై

దిశ, వెబ్ డెస్క్: Grok AI Is Now On Telegram: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని కృత్రిమ మేధ (ఏఐ)అంకుర సంస్థ ఎక్స్ ఏఐ..గ్రోక్ పేరుతో చాట్ బాట్ సేవలను తీసుకువచ్చి యూజర్లను ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకు కేవలం ఎక్స్ యూజర్లకు మాత్రమే పరిమితమైన ఈ సేవలను ఇప్పుడు టెలిగ్రామ్ లోన అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్కువ మంది యూజర్లకు ఈసర్వీసులను అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.
ఏఐ ఆధారిత చాట్ బాట్స్ సేవలు అందిస్తున్న సంస్థ మధ్య గట్టి పోటీ నెలకొంది. దీంతో యూజర్లను పెంచుకునేందుకు ఆయా సంస్థలు కొత్త మోడళ్లను అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేస్తున్నాయి. ఇలా ఏఐ ప్రపంచంలో పోటీని ఎదుర్కునే వ్యూహంలో భాగంగా గ్రోక్ ఏఐ టెలిగ్రామ్ తో చేతులు కలిపింది. ఇప్పటికే టెలిగ్రామ్ లో ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని గ్రోక్ తన ఎక్స్ హ్యాండిల్ లో తెలిపింది. అయితే ప్రీమియం యూజర్లకు మాత్రమే గ్రోక్ సేవలు అందుబాటులో ఉంటాయి. టెలిగ్రామ్ లో సెర్చ్ బార్ లో గ్రోక్ ఏఐ అని టైప్ చేసి ఈ సర్వీసులను వినియోగించుకోవచ్చు.
ఇక టెలిగ్రామ్ 2024 ఆగస్టు నుంచి చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటోంది. టెలిగ్రామ్ ద్వారా హవాలా మోసం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దాడికి సంబంధించి సమాచారం షేర్ చేయడం ఆరోపణల కారణంగా టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు సీఈవో పావెల్ దురోవ్ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి కంపెనీ సవాళ్లు ఎదుర్కొంటోంది. ఇతర ఫ్లాట్ ఫామ్స్ ఏఏఐతో రాణిస్తున్నప్పటికీ ..ఆ విభాగంలో అడుగుపెట్టకుండా యూజర్లను కోల్పోతోంది. తాజాగా ఇప్పుడు గ్రోక్ ఏఐ ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టి యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.