విద్యార్థులకు ప్రేరణనిస్తున్న ఇంగ్లీష్ టీచర్

by Javid Pasha |   ( Updated:2022-12-16 14:11:33.0  )
విద్యార్థులకు ప్రేరణనిస్తున్న ఇంగ్లీష్ టీచర్
X

దిశ, దేవరకద్ర: విశ్రాంత ఆంగ్ల భాషోపాధ్యాయుడు అబ్దుల్ రజాక్ ఆంగ్ల ప్రేరణ తరగతులు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. 2018లో పదవీ విరమణ పొందిన అబ్దుల్ రజాక్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆంగ్లం పట్ల ఉన్న భయాన్ని పోగొడుతూ ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. అప్పంపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు శుక్రవారం అప్పంపల్లి ముచ్చింతల ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల ప్రేరణా తరగతులు నిర్వహించారు. పాఠ్యపుస్తకంలోని అంశాలతో పాటు ప్రశ్నాపత్రం మౌలిక స్వభావం గురించి అవగాహన కల్పించారు. ఆంగ్ల భాషను నేర్చుకునేందుకు విద్యార్థులు రోజుకు కనీసం 40 నిమిషాలైనా కేటాయించాలని సూచించారు. మంచి మార్కుల సాధనకు అనుసరించాల్సిన మెళకువలను విద్యార్థులకు నేర్పించారు.


విద్యార్థులతో మమేకమై ఆటపాటలతో బోధించిన తీరు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు రజాక్ ను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ చక్రవర్తి గౌడ్, శ్రీనివాసులు, ఎల్లయ్య, పద్మజ, సుశీల, అనురాధ, సాధియా, ఫర్హాత్, ముచ్చింతల జి హెచ్ఎం అంజిలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed