ఆర్టీసీ కార్మికోద్యమం పై ఆంక్షలు ఎత్తివేయాలి.. ఏ.కృష్ణయ్య

by Sumithra |
ఆర్టీసీ కార్మికోద్యమం పై ఆంక్షలు ఎత్తివేయాలి.. ఏ.కృష్ణయ్య
X

దిశ, వనపర్తి : ఆర్టీసీ కార్మికోద్యమం పై ఆంక్షలు ఎత్తివేయాలి, ప్రజాతంత్ర హక్కులు పునరుద్ధరించాలి టీఎస్ఆర్టీసీ ఎస్ డబ్ల్యూ ఎఫ్ డిపో కార్యదర్శి కృష్ణయ్య డిమాండ్. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో గేటు ఎదుట ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో రీజియన్ కమిటీ సభ్యులు ఎండీ ఖయ్యుం, డిపో అధ్యక్షులు జె.వి స్వామి, నాయకులు కర పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వనపర్తి డిపో కార్యదర్శి ఏ.కృష్ణయ్య మాట్లాడుతూ ఆర్టీసీలో యూనియన్ల పై వున్నఆంక్షలను ఎత్తివేయాలని, ప్రజాతంత్ర హక్కులు పునరుద్ధరించాలని, ఆర్టీసీ నిర్వహణలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించి, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీఎస్ ఆర్టీసీ స్టాఫ్, వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఆర్టీసీలో ప్రజాతంత్ర హక్కుల పునరుద్ధరణ ప్రధానం అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 2017 వేతన పెంపుదల పై ఏకపక్షంగా ప్రకటన చేసిందిని, కార్మిక సంఘాలతో కనీసం చర్చించలేదు, వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోలేదు. వేతనాలు పెంచినట్లే పెంచి, 7సంవత్సరాల ఏరియర్ లను రిటైర్మెంటు అయ్యేటప్పుడు చెల్లిస్తామని, గత ప్రభుత్వం విలీనం ప్రకటన చేసినప్పుడు, విలీనం కంటే ముందే 11 సమస్యలను పరిష్కరించాలని, విలీన ప్రక్రియలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని కోరుతూనే, ఆ క్రమంలో 12 అంశాలలోని 80 సమస్యలకు సరైన పరిష్కారం చూపాలని కోరుతూ వినతిపత్రాలు, బుక్లెట్ అందించామన్నారు.

కార్మికులకు సరైన న్యాయం జరగాలంటే కార్మిక సంఘాల పాత్ర కీలకమన్నారు. అలాగే డిపో స్థాయిలో వస్తున్న సమస్యలు పరిష్కారం కావాలంటే కూడా కార్మిక సంఘాల పై ఆంక్షలు ఎత్తివేసి, స్వేచ్చగా పని చేసే వాతావరణం కల్పించాలన్నారు. ఆర్టీసీ సంస్థ రక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణలో కీలకమైన పాత్ర పోషించేవి కార్మిక సంఘాలు. అటువంటి కార్మిక సంఘాల పై ఆంక్షలు ఎత్తివేసి, ప్రజాతంత్ర హక్కులు పునరుద్ధరించాలని. ఆర్టీసీ నిర్వహణలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రజాతంత్ర హక్కులు పునరుద్దరించబడితేనే పని భారాలు, వేధింపులు వంటి వాటిని నిలువరించే అవకాశాలు మెరుగవుతాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed